అది నా బాధ్యత

డబ్బు సంపాదన లోనూ ఖర్చు విషయంలో నేను కాస్త ఎక్కువే అంటుంటారు కానీ నేనేం విచ్చల విడిగా ఖర్చు పెట్టను . తెలివిగా వెచ్చిస్తాను అన్నది కంగనా రనౌత్ . ఇష్టమైన వారి కోసం నన్ను ప్రేమించే వారికోసం ,సామజిక కార్యక్రమాల కోసం చేసే ఖర్చు ఏదైనా ఉందీ అంటే అది అసలు ఖర్చుగానే చూడను అవన్నీ నాకు ఇష్టం . నా సంపాదనలో కొంతభాగం వాటన్నింటి కోసం హక్కుగా పంచవలసిన వాళ్ళు ఎందరో ఉన్నారు . నేను నా చుట్టూ ఉన్నా వాళ్ళకోసం కాసిని డబ్బు వెచ్చిస్తే నన్ను ఖర్చు మనిషి ,గర్వమనీ ,ఇంకేదో అంటే మాత్రం నేనెందుకు లక్ష్య పెట్టాలి అంటోంది కంగనా రనౌత్ . సంపాదన అంత నాకోసమేనా ?నాకు సామజిక భాద్యత ఉంది అంటోందామె .