ఈ కోవిడ్  కాలంలో అపార పోషకాలు అందించే పాలకూర ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోండి అంటున్నారు పోషకాహార నిపుణులు.ఇందులో అధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.సూక్ష్మ పోషకాలైన విటమిన్ సి, నియాసిన్, విటమిన్ కె, లతోపాటు క్యాల్షియం ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.పాలకూరలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఖనిజాలు ఉండటం వల్ల ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు, శారీరక శ్రమ చేసే పెద్దలకు కూడా ప్రయోజన కారి.ఎక్కువగా తిన్నా తక్కువ క్యాలరీలు ఇచ్చే పాలకూర బరువు తగ్గాలనుకొనే వారి మెనూలో తప్పక ఉండవలసిన ఆహార పదార్థం.

Leave a comment