తల్లి కాబోతున్నా గీతా ఫోగట్

రెజ్లర్ గీతా ఫోగట్ తల్లి కాబోతోంది . కొత్త జీవం నీలో కదిలినప్పుడు తల్లికి అనందం మొదలౌతుంది . చిన్ని హృదయ స్పందన మొదటి సారిగా విన్నపుడు ఆనందం ఒంటరిగా ఉండదని తెలుస్తుంది . లోపల జీవి వృద్ధి చెందే వరకు జీవితం అంటే ఇంత అద్భుతం అని నువ్వు గుర్తించలేవు ,అంటూ కామెంట్ తో ,కడుపు ఎత్తుగా ఉన్న ఫోటోని పోస్ట్ చేసింది గీతా ఫోగట్. 30 ఏళ్ళ ఈ హర్యానా క్రీడాకారిణి కామన్ వెల్త్ గేమ్స్ లో భారతదేశానికి తొలి బంగారు పతకం సాధించి పెట్టింది . ఇప్పుడు తల్లి కాబోతున్నా సంతోషాన్ని ట్విటర్లో పంచుకొంది .