గ్రీన్ టీ ఎంతో మంచిదంటారు. అలా చెప్పటం ఈజీనే కానీ ఏ రుచి లేకుండా వట్టి నీళ్ళలాంటి గ్రీన్ టీ రుచిగా వుండాలంటే దానికి కాస్త తియ్యదనం కావాలి. అలా అని పంచదార వేస్తే గ్రీన్ టీ ఉపయోగమే పోతుంది. అందువల్ల గ్రీన్ టీ లో తేనె కలుపుకొని తాగితే ఆరోగ్యం అని తేల్చారు ఫుడ్ ఎక్స్పర్ట్స్. అయితే ఏ ఆఫీస్ లాంటి చోటుకో లేదా ప్రయనాల్లోనో తేనె సీసా పట్టుకుపోవడం కష్టం. కాస్త జిగురుగా వుండే తేనె జాగ్రత్తగా బయటికి తీసి సింపుల్ గా వాడే వీలు లేదు. మరి సింపుల్ గా ఎలా అంటే సమాధానంగా హనీ కాప్స్యుల్స్ రూపంలో అని చెప్పచ్చు. ఈ హనీ కాప్స్యుల్స్ ను సాధారణ కాప్స్యుల్స్ లా బయటివైపు పల్చటి పొరతో తయారు చేస్తారు. వీటి లోపల స్వచ్చమైన తేనె నింపి పెడతారు. ఈ హనీ కాప్స్యుల్స్ ని వేడిగా వుండే టీ లో వేసేస్తే పై కాప్స్యుల్స్ తోం సహా కరిగిపోతుంది. చాలా కంపెనీలే ఉన్నాయి. ఆన్లైన్ లో చూడొచ్చు.

Leave a comment