నీహారికా,

తప్పు వప్పుకోవడం చాలా కష్టం కాదు అని అడిగావు. మరి కష్టమే కానీ అవసరం కదా. తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు కదా. చేస్తారు వాస్తవాన్ని అంగీకరిస్తే తప్పులు ఒప్పుకోవచ్చు. క్షమాపన మరింత వేగంగా అడగగలరు. తప్పు అంగీకరించడం అంటే మానసిక ప్రశాంతతని పొందగలగడం. కొన్ని సందర్భాలలో ఎప్పుడో జరిగి పోయినవి మనస్సులో పెట్టుకుని అవతల వాళ్ళను దెబ్బతీస్తాం. అవతల వాళ్ళపై విజయం సాధించామని అనిపిస్తుంది కానీ అవతల వాళ్ళను బాధ పెట్టామన్న బాధ ముందు మన మనస్సుకే కలుగుతుంది. ఇలాంటి తొందర పాటు తో స్నేహాలను దూరం  చేస్తుంది. అవతల వాళ్ళ తప్పను మనస్సులో క్షమించి వదిలేయగలిగితే వారంతట వారే తమ తప్పు తెలుసుకుని ముందకు రావొచ్చు. ఇది సహనం తో అవతలి వాళ్ళ తప్పు ఒప్పించే పద్దతి. కలుపుగోలు మనిషి అని గుర్తింపు తెచ్చేడి కేవలం కబుర్లు కాదు. సందర్భానుసారంగా తప్పోప్పులు సరిచేసుకుంటూ, ఒక వేళ మనదే తప్పు అయితే మనస్పోర్తిగా తప్పుని ఒప్పుకోవాలి కుడా. ఇది అందరికి అంత సులభంగా వంట పట్టదు. కాకపొతే తప్పు మనవైపు వుంటే అంగీకరించే విశాలమైన మనస్సులో వుంది. ఎలా చేసినా తప్పు వప్పుకోవడం ఎంతో లాభం.

 

Leave a comment