ఇద్దరు పోట్లాడుకొంటూ ఉంటే సాధారణంగా సర్ది చెపుతూ ఉంటారు . కానీ దంపతుల విషయం మాత్రం ఆలా చేయకండి ,వాళ్ళు పోట్లాడుకొంటూ ఉంటే దీర్ఘకాలం జీవిస్తారు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . 200 జంటల పైన 30 ఏళ్ళ పాటు ఒక అధ్యయనం జరిగింది. దంపతులు ఇద్దరిలోను భావోద్వేగాలు ఒకే రకంగా ఉన్నపుడు వాళ్ళ ఇద్దరి సంభాషణలు సమతూకంగా ఏర్పడి వాళ్ళ ఆరోగ్యం స్థిరంగా ఉండే అవకాశం ఉందంటున్నారు . ఎంత గొడవపడితే అంత మంచిది . కానీ జంటలో ఒక్కళ్ళే కోపాన్ని ఆపుకోని మరొకరు రెచ్చిపోతూ గొడవకు దిగితే మాత్రం అది హెడ్స్ రిస్క్ ను రెండింతలు చేసి త్వరగా చనిపోయే ప్రమాదం ఉందంట ,సమాధానం చెప్పలేక పోతున్నామని ఒకరు ,సమాధానం ఇవ్వడం లేదని ఇద్దరు మనస్సులో అతిగా ఉద్రేకపడడం వల్ల సమస్య వస్తుంది అంటున్నారు .

Leave a comment