“రామ దూత హనుమా….శ్రీ రామ దూత హనుమా!!తవ చరణం…శరణం..భయ హరణం.

తాడ్బండ్ శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం సికింద్రాబాద్ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. శక్తి వంతమైన దేవుడు. జాపాలి మహర్షి తన తపోనిష్ఠ తో ఆంజనేయ స్వామిని శరణు వేడుకున్నాడు. వీరాంజనేయులవారు మహర్షి కోరిక మేరకు కొండపై గణపతి సమేతుడై వెలిశాడు.ఇక్కడి ప్రత్యేకత  స్వామి తూర్పు ముఖముతో దర్శనం ఇస్తారు.ధ్వజస్తంబం దగ్గర హనుమంతుని వాహనం అయిన ఒంటెని భక్తులు దర్శనం చేసుకుంటారు.   ఈ క్షేత్రంలో  శివ పంచాయతనం విశేషం.నంది,బ్రహ్మ, నాలుగు దిక్కుల వినాయక రూపాలు ప్రత్యేకం.కొత్త వాహనానికి ఇక్కడ పూజ తప్పనిసరిగా చేయ్యాలి.

ఇష్టమైన రంగు:సింధూరం
ఇష్టమైన పూలు: అన్ని రకాల పుష్పాలు అంగీకరిస్తాడు.
ఇష్టమైన పూజలు: తమలపాకుల పూజించి కోరిన వరాలు ప్రసాదిస్తాడు.

నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు,కేసరి

కేసరి తయారీ: ఒక గ్లాసు బొంబాయి రవ్వ కి నాలుగు నీళ్ళు లేదా కమలాపండు/అనాస పండు రసం తీసి పెట్టుకోవాలి. రవ్వ దోరగా వేయించాలి. నీళ్ళు మరగబెట్టాలి అందులో తగినంత పంచదార వేసి రవ్వని చిన్నగా పోస్తు ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
అంతే ప్రసాదం రెడీ. అలంకారం చేయండి జీడి పప్పుతో.
ఓ రామ నీ నామమెంతో రుచిరా!!

    -తోలేటి వెంకట శిరీష

Leave a comment