వాతావరణం చల్లగా ఉండే ఇల్లు అదో వాసనతో ఉంటుంది . రూమ్ ప్రెషనర్స్ అంతంత మాత్రమే పనిచేస్తాయి . ఇంట్లో సహజ సిద్దమైన సువాసలు రావాలంటే చిన్ని చిట్కాలు పాటించవచ్చు . గిన్నెలో నీళ్ళుపోసి మరగనివ్వాలి . అమరుగుతున్న నీళ్లలో కొన్ని నారింజ తొనలు ,అందులోనే ఓ చెంచా దాల్చిన చెక్కపొడి ,రెండు లవంగాలు వేసి ఇంకాస్త మరగనిఛ్చి ఈ గిన్నెను గదిలో ఓ మూలపెడితే ఇల్లంతా ఘుమఘుమలే . అలాగే గిన్నెడు నీళ్లలో ఏదైనా అరోమా ఆయిల్ వేసిన మంచి వాసనా వస్తుంది . ఇల్లు తుడిచే నీళ్లలో వేసేందుకు ఈ మిశ్రమం చాల సువాసనగా ఉంటుంది . బొరాక్స్ ,స్వీట్ ఆరెంజ్ ఎస్పీన్షియల్ ఆయిల్ లవంగాలు ,దాల్చిన చెక్క పొడి వంట షోడా కలిపి పెట్టుకొని గదులు తుడిచే నీళ్ళలో కాస్త కలిపితే మంచి వాసన వస్తుంది . అరకప్పు,బొరాక్స్ వంటసోడా కు ,30చుక్కల ఎస్పీన్షియల్ ఆయిల్ దాల్చిన చెక్క పొడి కలిపి పెట్టుకొంటే సరిపోతుంది .

ReplyForward

Leave a comment