తెలంగాణా రాష్ట్రం,మహబూబ్ నగర్ జిల్లా,కోయల్ కొండ కి సమీపంలో మన్యం కొండలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిగా వెలసి పూజలు అందుకుంటున్న స్వామిని దర్శించి వద్దాం పదండి!!
పురాణ గాథల ప్రకారం ఇక్కడ గుహలో మునులు తపస్సు చేసుకునే వారని అందుకే మునుల కొండ అని పిలిచేవారు కాలక్రమేణా మన్యం కొండగా ప్రసిద్ధి చెందింది.
ఇక్కడ స్వామి శేషశాయి రూపంలో దర్శనం ఇస్తారు. దిగువ కొండలో అలివేలుమంగా దేవి కొలువై ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళలేని భక్తులు ఇక్కడికి వచ్చి వారి మొక్కులు తీర్చుకోవడం,సంతాన ప్రాప్తి కలుగుతుంది.

నిత్య ప్రసాదం: కొబ్బరి,కొత్త కుండలో అన్నం,పచ్చి పులుసు.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment