“శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ప్రసాదం”

      నరమృగ శరీర నరసింహ!!
         ప్రహ్లాద వరదా నరసింహ!!

విశాఖపట్నానికి సమీపంలో వున్న సింహాచలం కొండనెక్కి అప్పన్నను దర్శనం చేసుకుని వద్దాం.
పురాణ గాథల ప్రకారం ఈ కొండ పై నుండే ప్రహ్లాదుని పడేశారని సింహాద్రి అప్పన్న కాపాడి ఈనాడు భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే స్వరూపుడుగా దర్శనం ఇస్తున్నారు.సంవత్సరానికి ఒకసారి చందనోత్సవ ఉత్సవం ఎంతో వైభవంగా జరిగుతుంది. ఇక్కడ దేవతలు ప్రతిష్ఠ చేసిన కప్పస్ధంబము వున్నది.సంతాన లేమి,వివాహ ప్రస్తావన మొదలగు సమస్యలుంటే మనస్పూర్తిగా నమస్కరిస్తే తప్పకుండా ఆశీస్సులతో నృసింహుడు కోరిక  తీరుస్తాడు.
స్వామి వారి కల్యాణం నయనానందకరం.ఈ పుణ్య క్షేత్రంను తప్పకుండా చూసి తరించగలరు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పులిహోర, దద్ధోజనం.

         -తోలేటి వెంకట శిరీష