“శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి ప్రసాదం”

      సుబ్రహ్మణ్యం..సుబ్రహ్మణ్యం..షణ్ముఖనాధా సుబ్రహ్మణ్యం!!

ఈ రోజు మార్గశిర శుద్ధ షష్ఠి.దినినే సుబ్రహ్మణ్యం షష్ఠి అని,స్కంద షష్టి అని జరుపుకుంటాము.సుబ్రహ్మణ్యేశ్వరునికి,వల్లీదేవికి వివాహం జరిగిన రోజు అని కూడా పిలుస్తారు.
తమిళనాడులో “పళని” అనే క్షేత్రంలో కార్తికేయుడుగా,కుమారస్వామిగా కొండ పైన పూజలు అందుకుంటున్నాడు.షష్టి నాడు కావడి ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతాయి.భక్తులు షష్టినాడు పాలు,విభూతి,పూలు,తేనె,నెయ్యి వీటిలో ఒకటి కావడిలో పెట్టుకుని పాదచారులై కొండకు వస్తే తనని ఆరాధించిన ఫలితం ఉంటుంది అని సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆదేశం.
సంతానం లేని వారికి సంవత్సరం తిరగకుండానే సంతానం కలుగుతుంది.సకల సౌభాగ్యాలు కలుగుతాయి.

నిత్య ప్రసాదం: కొబ్బరి,ఆవు పాలు

-తోలేటి వెంకట శిరీష