విష్ణుప్రియే సర్వ లోకప్రియే….సర్వ నామప్రియే….సర్వ సమరప్రియే…హే బ్రహ్మచారిణే…దుష్కర్మవాసినే…కాళికే…దుర్గే దేవీ…!!

ఈ రోజు మహిషాసురమర్దిని అవతారంలో మహిషాసురుణ్ణి సంహరించి రేపు రాజరాజేశ్వరీ
అమ్మ వారుగా మనకు దర్శనం ఇస్తారు.ఈ రోజు ఆకుపచ్చ,నలుపు
వస్త్రధారణలో,రేపు కాషాయ రంగు వస్త్రధారణలో అమ్మవారికి కుంకుమార్చన,శ్రీ లలితా సహస్ర నామము పఠించాలి.ముత్తైదువులకు పసుపు, కుంకుమ,గాజులు,పండ్లు వాయినం ఇచ్చిన ఆ దుర్గా దేవి అనుగ్రహం కలగడం విశేషం.
దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.కుమారి,సువాసిని పూజలు చేస్తారు.అన్నదాన వితరణ చేస్తారు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,పొంగలి,పులిహోర.

“దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు”

   – తోలేటి వెంకట శిరీష

Leave a comment