శ్రద్ధగా వాడాలి

ఖరీదైన అలంకరణ సామాగ్రి కాస్త జాగ్రత్తగా వాడుకొంటే అవి అయిపోయే వరకు ఎండి పోకుండా ,సూక్ష్మ క్రిములు చేకుండా ఉంటాయి. ఫౌండేషన్ ఆరునెలల నుంచి ఏడాది వరకు దాన్ని చేతిలో తాకకుండా ముంజేతిపైన వేసుకొని వాడుకొంటే పాడై పోకుండా ఉంటుంది. ఐబ్రో పెన్సిల్ ఏదాడి అయినా పద్దతిగా చెక్కి వాడుకోవచ్చు. కాటుక పెట్టుకోవటం అయ్యాక చల్లని ప్రదేశంలో భద్రం చేయాలి. మంచి పరిమళాలు వచ్చే అత్తర్లు ఎనిమిది నుంచి పదేళ్ళవరకు పాడైపోవు. ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ కాలం ఉంటాయి. లిప్ స్టిక్ లైనర్ పొడి బారినట్లు అనిపిస్తే పారేయల్సిందే. మస్కార్ అయితే మూడు నెలలకంటే ఎక్కువ సమయం వాడితే కళ్ళు పాడవుతాయి.