స్పెయిన్ లో టమాటా ఫిస్టివల్

మనదేశంలో హోలీ వేడుకల్లో రంగులు చల్లు కొంటారు . అలాటిదే టమాటాల పండగ టమాటా బాటిల్ లేదా లా టమాటి నాగా పిలుచుకునే ఈ పండగ స్పెయిన్ దేశంలో బూనాల్ లోని వాలెన్సియన్ టౌన్ లో జరుపుకొంటారు . ఈ పండగ ఆగస్టు నెల చివరి బుధవారం నాడు జరుగుతుంది . ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ పండగలో రకరకాల టమాటాలు విసురుకొంటారు . అక్కడి విధులు ,మనుష్యులు టమాటాలతో తడిసి ముద్దాయి పోతారు .