చర్మం మెరిసేట్టు

బరువును అదుపులో ఉంచుకోక పోతే చర్మమూ జుట్టు కాంతిహీనంగా మారటం జుట్టు పలచబడి పోవటం వయస్సు మించినట్లు కనిపించటం సర్వ సాదారణం …. ఊబకాయం,పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించు కోవాలి . అంటే ఆరోగ్యకరమైన ఆహారం శారీరక వ్యాయమం తో కూడిన జీవన శైలి ముఖ్యం . పిండి పదార్దాలు తీపి పదార్దాలు మితంగా తీసుకోవాలి . వేపుళ్ళు ,జంక్ ఫుడ్ ,కూల్ డ్రింక్స్ మనేయాలి . భోజనంలో అన్నం కంటే కూరలు,పప్పు పెరుగు ఎక్కువ మొత్తంలో తినాలి . జీవనశైలి కి అవసరమైనన్ని కేలరీలున్నా ఆహారం తీసుకోవాలి . కూరగాయల ముక్కలు కమలా ,యాపిల్,పుచ్చ,బొప్పాయి మొదలైన ఫలాలు తినటం వల్ల చర్మం మెరుపును సంతరించు కొంటుంది . ప్రోటీన్లు ఖనిజాలు అధికంగా వుండే బాదం,ఆక్రూట్ ,పిస్తా వంటి పప్పులు పుచ్చగింజలు పొద్దు తిరుగుడు గింజలు తినాలి .