సింధుకు స్పాన్సర్ షిప్

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు స్పాన్సర్ షిప్ ప్రపంచంలో పెద్ద ఘనతను నమోదుచేసింది. చైనాకు చెందిన క్రీడా ఉపకరణాల సంస్థ లీ నింగ్ నాలుగేళ్ళ కాలానికి సింధుతో ఒప్పందం కుదుర్చుకొంది . దీని ప్రకారం సింధుకు లినింగ్ 50 కోట్లు చెల్లిస్తుంది. 40 కోట్లు స్పాన్సర్ షిప్ మొత్తంగా ,మిగతా పది కోట్లు బాడ్మింటన్ క్రీడా సామాగ్రి రూపంలో ఆమెకు అందజేస్తుంది. ఇకపై సింధు లి నింగ్ క్రీడా ఉత్పత్తులనే వాడాలి.