ఓం నమశ్శివాయ!!శంభో శంకరా!!

కార్తీక మాసం శివారాధన చేస్తూ..శివనామ స్మరణ ధ్యానిస్తూ..శివయ్యను పూజించటమే మోక్షం.
పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంకి 5 కి.మీ.దూరంలో ఉన్న యమనదుర్రులోని శక్తీశ్వరాలయం పయనిద్దాం.
శంబురా అనే రాక్షసుడు యమపురిని పాలించే యముడి రాజ్యంలో ప్రజలందరిని హింసించేవాడు.మహాశివుడు లోక కల్యాణం కోసం తపస్సు చేస్తున్న యముడు శరణు వేడుకోగా పార్వతి దేవి ప్రత్యక్షమై ముడిచి శంబురాని వధించటానికి ఆయుధం ప్రసాదించింది.శంబురాను హతమార్చి లోక కళ్యాణార్థం పార్వతి,సుబ్రహ్మణ్యేశ్వర సహిత
శివయ్యను ఆ ప్రదేశంలోనే స్ధిరముగా ఉండి కాపాడమని  యముడు వేడుకున్నాడు. అందుకే ఇక్కడ స్వామి వారు లింగ రూపం కాకుండా శీర్షాసన భంగిమలో విగ్రహ రూపంలో దర్శనం ఇస్తారు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,ఉపవాసం వుండి అభిషేకించటం.

             -తోలేటి వెంకట శిరీష

 

Leave a comment