ఆలు మగలు మధ్య బంధం గట్టిగా  ఉండాలంటే ఇద్దరికీ కలిసి సెంటిమెంట్ సినిమాలు చూడమంటున్నారు పరిశోధకులు . విడాకుల కోసం వచ్చిన దంపతులకు మానవ సంబంధాలకు గురించిన కౌన్సిలింగ్ ఇస్తే వారిలో విడిపోవాలన్న కోరిక తగ్గటానికి రెండు మూడేళ్లు పడుతోందిట. దీనికంటే సినిమాలు చూపిస్తే బెస్ట్ కదా అంటున్నారు న్యూయార్క్ లోని బింగ్ టన్  యూనివర్సిటీ శాస్త్రవేత్త  మాధ్యు జాన్సన్. సాధారణంగా మనుషులు సినిమాల్లోని పాత్రలతో తమను పోల్చుకుని చూస్తుంటారు కనుకే చాలా సినిమాలు హిట్  అవుతుంటాయంటారు. జీవితంలో కలతలను సెంటిమెంట్ సినిమాల్లో సంఘటనలకు అవ్యయించుకుని వాటని తుడిచేసుకునే అవకాశం ఉందంటున్నారు. అసలు కలతలు రావటానికి ముఖ్యకారణం భార్య భర్తా  ఎవరైనా సరే వారికి కొన్ని సొంత ఆలోచనలు ఆశయాలు కోరికలు అభిప్రాయాలు ఉంటాయి. ఈ విషయం లో పరిధిదాటి అవతలివాళ్ళను  నొప్పిస్తేనే బంధాలు బలహీనపడతాయి. అలాగే ఇద్దరిమధ్య దాపరికాలు కూడా విభేదాలకు కారణం దాపరికాలు ఉండటం. అందుకే భార్యాభర్తలు స్నేహితులు ప్రేమికులు ఎవరైనా సరే బంధంలో వీలైనంత స్వచ్ఛత పారదర్శకత ఉండటం చాలా అవసరం.

Leave a comment