స్వచ్ఛభారత్ పురస్కారం అందుకొన్న సెల్వి తమిళనాడు,మధురై లోని  సక్కే మంగళం నిరాశి . టైలరింగ్ షాప్ నిర్వహిస్తుంది. స్వయం సహాయక సంఘాల్లో పనిచేస్తోంది. బహిరంగ మలవిసర్జన ను నిర్ములించేందుకు పూనుకొని వేల సంఖ్యలో మరుగు దోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ భారత్ మిషన్ రూపంగా ఇచ్చే 12 వేల రూపాయల ప్రోత్సహం గురించి ఇల్లిల్లు తిరిగి ప్రచారం చేసి ,సమావేశాలు నిర్వహించి గ్రామాల్లో మార్పు తీసుకువచ్చింది. తనతో పాటు మహిళా బృందాన్ని ఏర్పాటు చేసుకొని మధురై జిల్లలో ఐదువేల మరుగు దొడ్ల్ నిర్మించ గలిగింది ఈమె సేవకు గాను అవార్డ్ వరించింది.

Leave a comment