సైంటిస్ట్ బార్బీ

చిన్నారుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంచేవిధంగా శాస్త్రవేత్త బార్బీ మార్కెట్లోకి విడుదల అయింది. పిల్లలు ఎంతో ఇష్టపడే ఎంతో ఇష్టపడే ఈ బార్బీ బొమ్మను డిజైన్ చేసిన నళిని చెపుతున్నారు ఉతాహ్ విశ్వా విద్యాలయంలో అటవీ పర్యావరణ వేత్తగా పని చేస్తున్న నళిని తన కూతురు బార్బీ బొమ్మను కావాలని కోరటంతో ఏదైనా కొత్తగా ఉండాలనే ఉదేశ్యంతో శాస్త్రవేత్త బార్బీని తయారు చేసి దానికి ట్రిటావ్ బార్బీ గా నామకరణం చేసింది. విద్యార్థులకు ప్రకృతి పై అవగాహన,పర్యావరణం పై తీసుకోవలసిన జాగ్రత్తలు బోధిస్తారు నళిని చిన్నపుటి నుంచీ ఇలాటి బొమ్మలు చూస్తూ ఉంటే పిల్లలకు సైన్స్ పట్ల ప్రేమ కలుగుతోంది అంటోంది నళిని.