స్కూల్ బ్యాగ్ తో నొప్పులు

స్కూల్ బ్యాగ్స్ మోసే పిల్లల్లో వెన్ను నొప్పి కనిపిస్తోంది అంటున్నారు డాక్టర్స్. వీపు పైన బరువుతో వంగి పోయి నడవటం వల్ల కండరాలు నొప్పి పుడతాయి. ఒక పక్కకి బరువును నెట్టేస్తే ఆప్రాంతం కండరాలు బెణికినట్లు అయి లిగ మెంట్ వత్తిడికి గురి అవుతోంది. ముందే గుర్తించి శ్రద్ధ తీసుకోకపోతే భవిష్యత్ లో అది వెన్నునొప్పిగా స్థిరపడుతుంది. శరీర భంగిమ,బ్యాగ్ మోసే విధానం లో మార్పు తెస్తే నొప్పులు తగ్గిపోతాయి. చిన్న పాటి వ్యాయామం వల్ల కూడా రిలీఫ్ తప్పించవచ్చు ఫిజియోథెరఫీ యోగాసనాల వల్ల ఉపశమనం లభిస్తుంది. పిల్లలు మోసే స్కూల్ బ్యాగ్ గుర్తించి కాస్త శ్రద్ధ పెట్టి వాళ్ళు దాన్ని మోయ గలుగుతున్నారో లేదో గమనించమంటున్నారు.