ఉద్యోగ విరమణ తర్వాత ప్రతినెలా తమకు ఎంతడబ్బు అవసరం ఉంటుందో లెక్కలు వేసుకొని అంతసొమ్ము తప్పని సరిగా నెలసరి వేతనంలో పొదుపు చేసుకోండి అంటున్నారు నిపుణులు . రిటైర్ మెంట్ కోసం చేసే పొదుపు 30 ,40  ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ప్రారంభం చేయాలి . పిల్లలు భాద్యతగా ఉండచ్చు నిజమే . వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళకున్న బాధ్యతలతో కూడా అంత భౌతికంగా,మానసికంగా,ఆర్థికంగా సాయంగా ఉండగలదా అన్నా ప్రశ్నకు సమాధానం చెప్పటం కష్టమే అంటారు నిపుణులు. అందుకే పిల్లలను పెంచి పోషించటం మన భాద్యత లాగా వృద్ధాప్యంలో ఇతరుల పైన ఆధారపడకుండా ఉండటం గౌరవం ,భాద్యత కూడా అందుకే ఆరోగ్య భీమా చేయించుకోవటం ,పొదుపుగా ఉంటూ ,వార్ధక్యం కోసం డబ్బు సేవ్ చేసుకోవటం చాలా ముఖ్యం. అనవసరంగా పిల్లలను పట్టించుకోవటం లేదని నిందించ కుండా ముందు పొదుపు సంగతి చూడండి అంటున్నారు నిపుణులు .

Leave a comment