చర్మం,జుట్టు ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో రకాల ఫ్యాక్స్ వేసుకొంటారు . కొన్ని సహజమైన పదార్దాలు కోరుకొన్న ప్రయోజన్నాని ఇస్తాయి . కలబంద గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఇందులో సమానమైన పరిమాణంలో కొబ్బరి నూనె ,ఆముదం,మెంతులు కలపి మరగనివ్వాలి బాగా వేడయ్యాక దాన్ని చల్లార్చ ఓ డబ్బాలో భద్రపరుచు కోవాలి . దీన్ని తలస్నానం చేసే ముందర జుట్టుకు పట్టించి మసాజ్ చేస్తే వెంట్రుకలకు చక్కని పోషణ అందుతుంది . ముఖం పై మచ్చలు తగ్గాలంటే పావుకప్పు కలబంద గుజ్జులో తేనె తులసిపొడి కలిపి దాన్ని పాడుకొనే ముందుర మొహానికి రాసుకొని ఓ అరగంట తర్వాత కడిగేయాలి . రోజూ ఇలా చేస్తే ముఖం పైన ఉన్నా మచ్చలు పోతాయి .

Leave a comment