దాదాపు అన్ని రకాల వస్త్ర శ్రేణిలో సిల్క్ కాటన్ మిక్స్ తో సీకో కాటన్స్ కనిపిస్తుంటాయి. గద్వాల్ ,ఉప్పాడ ,చీరాల హాండ్ లూమ్ ,అన్నింటిలోనూ  సిల్క్ కలగలిసి చక్కని సీకో చీరలు కనిపిస్తాయి. మెరిసే పల్చని సీకో చీరలపై ఎంబ్రాయిడరీ జరీ వర్క్ లు అలంకరణ కే  నిండుతనం ఇస్తాయి. సహజంగా మగ్గాల పై అద్భుతమైన నేత చీరలు నేసే చేనేత దారులు కూడా ఆధునికత కోసం సీకో చీరలకు కొత్త డిజైన్లు తెస్తున్నారు. సంప్రదాయ శ్రేణులైన చీరాల నేత చీరలు అటు నల్గొండ కు చెందిన ప్రముఖ పోచంపల్లి చీరల్లో కూడా సీకో అందాలు ఎప్పటినుంచో మొదలయ్యాయి. ప్యూర్ గద్వాల్ జరీ చీరల్లో ఆధునిక డిజైన్స్ కలిపేసి సీకో గద్వాల్ పట్టు చీరలొచ్చాయి. మంగళగిరి కాటన్స్ లో అయితే సీకో చీరలకు తిరుగేలేదు. జరీ అంచుతో పువ్వుల ప్రింట్లు కలుపుకుని మరీ ఖరీదు కాకుండా పండగ వాతావరణం కల్పించేస్తాయి. ఒక్కసారి ఫర్  చేంజ్ అనుకుంటూ ఈ సీకో సిల్కల వైపు చూడండి.

Leave a comment