శరీరాన్ని కొన్ని వేళలకు సిద్ధం చేయండి అంటున్నాయి అధ్యయనాలు. శరీరక జీవ గడియారాన్ని సరిగ్గా పని చేయించాలి అంటే ప్రతి పని ఒకే సమయానికి జరిగేలా చూడాలి. నిద్ర ,భోజనం ,చదువు,పని ,మందులు ఏదైనా ఒక టైం ప్రకారం శరీరానికి అలవాటు చేయాలి.ప్రతి రోజు రాత్రి ఒకే సమయానికి పడుకొని ఒకే సమయానికి నిత్ర లేవాలి.పడుకొనే ముందు ,సాయత్రం వేళల్లో కెఫీన్ ఉండే పదార్థాలు వద్దు. సాయంత్రం ,ఉదయం వేళల్లో నడక ఒకే సమయానికి చేయాలి. దీని వల్ల రాత్రి నిద్ర పడుతోంది చల్లగా తగు మాత్రం వెలుగు ఉన్న గదిలో నిద్రకు ఉపక్రమించాలి. నిద్ర పోయే ముందు టెలివిజన్ ,ఫోన్ మొదలైనవి వాడకుండా మెదడును నిద్రకు సిద్ధం చేయాలి.అలాగే సరైన భోజన వేళలు పాటిస్తే అనారోగ్యలు రావు.

Leave a comment