సైఫ్ అలా చెప్పడు

సోషల్ మీడియాలో నెటిజన్స్ చేసే ట్రోల్ కు బాలీవుడ్ తారలు,ముఖ్యంగా బాధితులు ,బాడీ షేమింగ్ చేస్తూ నెటిజన్స్ చేసే ట్రోల్స్ కు కరీనా కపూర్ ఎప్పుడు ఘాటైన జవాబులు ఇస్తూనే ఉంటుంది. తాజాగా కరీనా బికినీతో భర్త సైఫ్ అలీ ఖాన్ పక్కన నిలబడి ఉన్న ఫోటో షేర్ చేశాడు. దీనికో నెటిజన్ కరీనాను బికినీ వేసుకొనేందుకు ఎందుకు అనుమతి ఇచ్చావని దూషిస్తూ కామెంట్స్ చేశాడు. ఇటీవల ఒక షోలో కరీనా పాల్గొన్న సమయంలో అర్బాజ్ ఖాన్ ఈ నెటిజన్ కామెంట్ ని చదివి వినిపించాడు. దీనికి కరీనా వెంటనే నేను బికినీ వేసుకొకుండా అడ్డుకొనేందుకు సైఫ్ ఆలీఖాన్ ఎవరు? నువు అలా ఉండద్దు అంటూ సైఫ్ ఎప్సుడు చెప్పడనీ, తమ మధ్య ఉన్న బాంధవ్యంలో ఇవన్నీ అతి మామూలు విషయాలనీ కరీనా చెప్పింది. అసలు ఇలాంటి ట్రోల్ ని లెక్క చేయనన్నది కరీనా.