నిహారికా……………

రాబోయే కొత్త సంవత్సరాన్ని ఆకాశంలో మెరిసే ఇంద్ర ధనస్సుతో పోల్చావు బావుంది. ప్రకృతి తో పోలికలు ఎప్పుడూ అద్భుతంగానే ఉంటాయి. ఎవళ్ళూ గుర్తు చేయకుండా తనతో మార్పులు తెచ్చుకునే ప్రకృతి కంటే గొప్ప గురువు ఎవరుంటారు మనకి. కొత్త సంవత్సరపు శుభవేళ నా శుభాకాంక్షలూ ఇవే. ఈ అద్భుత ఘడియల్లో నేను ఎప్పుడూ మారేందుకు సిద్ధంగా ఉంటాను. నా ఆలోచనలు అభిప్రయాలు నన్ను నేను అభివృద్ధి చేసుకునే క్రమంలో మార్చుకుని అందరూ  నన్ను అభిమానించేలా ఆదర్శంగా తీసుకునేలా నన్ను నేను దిద్దుకుంటాను. అనే పతిజ్ఞ  తీసుకోవాలి. రుతువులు మార్చుకుంటూ మనకి సమస్తం అమర్చిపెట్టే ప్రకృతిలా మనమూ మారుతూ ఇతరుల కోసం సంతోషం పంచుతూ నిస్వార్ధంగా ప్రవర్తిస్తూ ఉంటే అప్పుడేంత బావుంటుందీ  జీవితం. మన మనస్సనే ఉద్యానవనం లో ఏది  నాటితే  అదే మొలుస్తుంది. మనం స్నేహం ప్రేమ నాటామనుకో వెయ్యింతలుగా మనకవి ఫలాలిస్తాయి. వ్యతిరేక భావాలు వదిలేద్దాం. ఓడి పోయినా నేర్చుకుందాం. కోరుకున్నవి కష్టపడి సాధించుకుందాం. మంచి ఆహారం మంచి వ్యాయామం ఆరోగ్యం ఇవన్నీ  శ్రద్ధ  పెట్టి నిలుపుకుందాం. నువ్వు అన్నట్లే రేపటి ఆశల హరివిల్లు ఆకాశంలో అందంగా పరుచుకుంటోంది. పాత సంవత్సరం చరిత్రపుట లోకి జారిపోతూ రేపటికి ఆహ్వానం

Leave a comment