రిలాక్సింగ్ డైట్

ఒత్తిడిగా ఉంటే చిరాకు,పరాకు ఎక్కువవుతాయి ఏవో చేయాలన్న తోచనట్లు ఐపోతు ఉంటుంది. ఈ ఒత్తిడి కారణం గానే,డైట్ విధానం,శారీరక పనితీరు మారిపోతాయి క్యాలరీలు ఎక్కువ వుండే పదార్ధాలు తినాలని మనస్సు తొందర పెడుతు ఉంటుంది. ఇలాంటి సమయంలో ఓ గ్లాస్ నీళ్ళు తాగి,పదినిముషాలు ఆలా శాంతంగా ఉండమంటున్నారు ఎక్స్ పర్ట్స్. అలాగే ఓ కప్పు హెర్బల్ టీ ఆకలిని సంతృప్తి గలుగుతుంది. అలాగే త్వరగా ఆకలిని తీర్చగల పోషక పదార్ధాలు అందు బాటులో ఉంచుకోవటం చాలా మంచిది. ఈ క్రమం తప్పని ఆహారం నియమాలే ఒత్తిడి కి ఔషధం వంటివి. ద్రాక్ష,బెర్రీ,టమాటో వంటి తక్కువ క్యాలరీలున్నవి రిలాక్సింగ్ డైట్ గా చెపుతారు ఎక్సపర్ట్స్.