సఖీమణులందరికీ ముందుగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు మరియు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు!!
ఈ రోజు అందరం బిజి.మన మువ్వన్నెల జెండా పండగ అదే విధంగా సోదర-సోదరీమణుల పండుగ.ఎంతో శ్రేష్ఠమైన రోజు.
పురాణాల ప్రకారం దేవతలకు,రాక్షసులకు పుష్కరం పాటు భీకరమైన యుద్ధం జరిగింది. దేవతలకు నిగ్రహం కోల్పోయారు .ఆ సమయంలో దేవేంద్రుడి ని గెలిపించాలని ఇంద్రుడి భార్య శచీదేవి రక్ష కంకణం కట్టడం మొదలు దేవతలు విజయం సాధించారు.
ఇలాగే శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తితో ఉండిపోయాడు.అప్పుడు లక్ష్మీ దేవి బలిచక్రవర్తికి కంకణం కట్టడం సోదర భావంతో శ్రీ మహావిష్ణువుని విడుదల చేశారు.
ఈ పండుగ కేవలం కంకణం కట్టడం సోదరుడు ఇచ్చిన కానుక అందుకోవటమే కాదు….సోదరుని విజయానికి రక్ష కడితే ఆ విజయానికి కారణం ఆదిశక్తివి నీవమ్మా..నీ శక్తికి నేను రక్షణగా వుంటానని మాట ఇస్తారు.

“యేనబధ్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః
తేనత్వామభిబధ్నామి రక్షే మాచల మాచల”.

ప్రసాదం: పండ్లు,జిలేబి, గులాబ్ జామ్…

-తోలేటి వెంకట శిరీష

Leave a comment