చిరుజల్లులు,హరివిల్లులతో పాటు ఫీవర్లు ,జలుబులు ,గొంతు సమస్యలు ,జీర్ణ సమస్యలు ఇలా చాలానే అనారోగ్య సమస్యలు కలిగించే వైరస్ లు బాక్టీరియాలు కూడా పుట్టుకొచ్ఛే కాలం ఇది . టైఫాయిడ్ ,చికెన్ గున్యా ,డెంగ్యూ వంటి జ్వరాలు ప్రబలుతున్నాయి . ఈ ఇన్ఫెక్షన్ సాధారణంగా చిన్న పిల్లలనే ఇబ్బంది పెడతాయి . వాళ్ళలో వ్యాధి నిరోధక వ్యవస్థ దృఢంగా ఉండకపోవటం వల్ల వెంటనే ఏదో అనారోగ్యం చుట్టేస్తూ ఉంటుంది . ఏ మాత్రం పిల్లలో తేడా కనబడిన వెంటనే వైద్యులను కలుసుకోవాలి కొన్ని వైరల్ ఫీవర్లు లో ప్లేట్ లేట్స్ తగ్గిపోతాయి . మంచి ఆహారం ఇవ్వవలసి ఉంటుంది . అన్ని జ్వరాలు ఒకే రకమైనవి కాదు . శ్వాస సమస్యలున్నా ,దగ్గు వేదిస్తూవున్నా ,ఆయాసం జ్వరం తీవ్రత ఉన్న వెంటనే డాక్టర్ సలహాతోనే మంచి వైద్యం అందించాలి . ఇంటి వైద్యం ప్రమాదం .

Leave a comment