” రాఘవేంద్ర స్వామి ప్రసాదం”

“యతి  రాఘవేంద్రుని ఆరాధనం…
      ప్రతి నిత్యము సర్వ పూజలందు కోను    
              బృందావనం”!!

రాఘవేంద్ర స్వామి అనగానే గుర్తుకు వచ్చేది “మంత్రాలయము”.పేరు లోనే మంత్రముంది.
రాఘవేంద్ర సన్నిధిని బృందావనంలోని అనుభూతి కలుగుతుంది.వాతావరణంలోనే ఒక శక్తివంతమైన పవిత్రత వున్నది.రాఘవేంద్ర స్వామి పూజంచిన మన కష్టాలను తొలగించి
మనకు మంచి చేకూర్చుతాడు.
తుంగభద్ర నది తీరాన కొలువున్న ఈ స్వామి ప్రత్యక్ష దైవం.మూగ, చెవిటి వారికి ఎన్నో అద్భుతాలు జరిగాయి.ఆయన గొప్ప శ్రీ కృష్ణ భక్తుడు.ఆయనకు అలంకారం ఏనుగులు.తెల్లవారుజామునే స్వామి వారికీ
సుప్రభాత సేవ కొరకు చక్కగా అలంకరించి సేవకు అభిషేక జలంతో బయలుదేరుతాయి.
భక్తులకు తొండంతో ఆశీస్సులు అందిస్తాయి.
పిల్లల పట్ల వారి సన్నిధిలో కోరుకుంటే మరుక్ష  ణం తీర్చే దైవం.
రాఘవేంద్ర స్వామి బృందావనంలో ఉంటే సాక్షాత్తూ శ్రీ కృష్ణ భగవానుని సేవలో ఉన్నట్లు పరమ పావనం చెందుతారు.రుద్రాక్షలు ధరించిన ఎంతో మేలు.

ఇష్టమైన రంగు: కాషాయం
ఇష్టమైన పూలు: అన్ని రంగుల పూలు సమర్పించిన ఆనందంగా కటాక్షం.

నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు, పరిమళ ప్రసాదం.

పరిమళ ప్రసాదం తయారీ: నీళ్ళలో తీపికి తగినంత పంచదార వేసి నానబెట్టాలి.బొంబాయి రవ్వ నేతి లో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు,కిస్మస్ కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.మూకుడు పెట్టి పంచదార నీళ్ళను వేయించిన రవ్వతో ఉండలు లేకుండా కలుపుకోవాలి. మిశ్రమం గట్టి పడ్డాక
జీడిపప్పు,కిస్మస్,యాలకు పొడి వేస్తే ఘమ ఘమ లాడే పరిమళ ప్రసాదం తయారు.

  రండి మరి రాఘవేంద్ర స్వామి కి ప్రసాదం నైవేద్య పెట్టి అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిద్దాం!!    

      -తోలేటి వెంకట శిరీష