రాగాల జూకాలు 

సంగీతం ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ మందే. యువతరం ప్రతి సెలబ్రేషన్ ని సంగీతం తోనే ముడి పెట్టుకొంటారు. పాట వినకుంటే నిముషం నడవదు కొందరికి. ఆ ఇష్టం కాస్తా ఆచరణాల్లోకి వస్తే ఎలా ఉంటుంది? రాగాలు పలికే సంగీత వాయిద్యాలతో ఎన్నో అందమైన కర్ణ భరణాలు తయారు చేశారు కళాకారులు గిటార్,సంతూర్,వయోలిన్ వాయిద్యాలు చెవి దిద్దులుగా లోలాకులుగా మారి ముచ్చటగా అమ్మయిల చెవులపైనా నవ్వుతోన్నాయి. వర్ణాభరితమైన రాళ్ళు ముత్యాలు కలగలుపుకొని ఈ సంగీత వాయిద్యాల నగలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి.