రోజంతా కష్టపడి పని చేశాక శరీరం,మనసు చక్కని విశ్రాంతి పొందాలంటే చక్కని నిద్ర పోవాలి ఎంత క్వాలిటీ నిద్ర పోతున్నం అన్న దాని పైన ఆరోగ్యం ఆధారపడి వుంటుంది. సుఖ నిద్ర పనిలో ఉత్పాదక శక్తిని పెంచటమేకాక ,జీవన ప్రమాణాలను పెంచుతోంది . మంచి నిద్రకు మార్గాలున్నాయి క్రమం తప్పని వ్యాయామాలు చేయాలి. పడుకునే ముందు స్నానం చేస్తే నిద్ర క్వాలిటీ మెరుగవుతుంది. పడుకునే ముందు ఐదు నిముషాలు ధ్యానం చేయటం కూడా మంచి అలవాటే . పడుకునే గది చీకటిగా ఉండాలి. ఆందోళన ,కోపం,లో ప్రతికూల భావాలతో నిద్రకు ఉపక్రమించవద్దు . పడుకునే ముందర గోరు వెచ్చని పాలు తాగటం వల్ల మంచి నిద్ర పడుతోంది.

Leave a comment