చరిత్ర పునరావృతం అవ్వుతుందంటారు. మరి చరిత్రలోకి వెల్లిపోయినా ఫ్యాషన్ ట్రెండ్స్ మాత్రం వెనక్కి పోతూ అప్ ముందుకు వస్తూ, వచ్చె దారిలో కొత్త రూపాల్లోకి మారిపోతూ అమ్మాయిలను ఆకర్షించేస్తూ వుంటాయి. లేగ్గింగ్స్ ఇది వరకు సాదా సీదాగా నలుగు ఐదు రంగుల్లో వచ్చేవి. కొన్నాళ్ళు వాడాక బోర్ కొట్టేసి అమ్మాయిలు అవతల పడేసారు. ఇప్పుడు ఆ లేగ్గిన్స్ ని డిజైనర్లు కాలి మడమ నుంచి పై భాగం వరకు పువ్వులు, లతలతో అలంకరించి రకరకాల బొమ్మల డిజైన్ లతో కొత్త రూపం ఇచ్చేసారు. ఇంకో వైపు చుడీదార్, సల్వార్, పటియాల, పలజో, నారోకట్ లాంటి సల్వార్ల ట్రెండ్లో కూడా మార్చేసింది. వీటి అన్నింటినీ పక్కన పెట్టేసాయి లేగ్గింగ్స్. వీటి పైకి కుర్తీ అంట్రల్లా ప్రాక్ మోడల్ వంటి టాప్స్ కూడా ఎంతో చెక్కగా నప్పుతాయి. అలగే టీ షర్టులు, జాకెట్ లాంటి టాప్స్ కూడా బానే వుంటాయి. ఈ ఫ్యాషన్ డిజైన్స్ ఓ సారి చూసేయండి.

Leave a comment