రికార్డ సృషించిన పుష్ప కోహ్లీ

పాకిస్థాన్ పోలీస్ శాఖలో కొలువు సాధించిన మొదటి హిందూ మహిళ గా రికార్డ్ సృషించింది పుష్ప కోహ్లీ . ప్రపంచంలోని ముస్లిం ప్రాబల్య దేశాల్లో పాకిస్థాన్ ఒకటి . అక్కడ హిందువులు మైనారిటీలే . అధికారుల లెక్కల ప్రకారం పాకిస్థాన్ లోని హిందువుల సంఖ్య 75 లక్షలు . చాలా మంది సిందూ ప్రావిన్స్ లో స్థిరపడిన వారే . పుష్ప కోహ్లీ అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ గా నియమితురాలైనట్లు పాకిస్థాన్ కు చెందిన వార్తా సంస్థ వెల్లడించింది . సింధ్ పోలీస్ శాఖలో పుష్ప మొదటి హిందూ మహిళగా రికార్డ్ సాధించింది .