పోస్ట్ వర్కవుట్

వ్యాయామం చేసిన తర్వాత వెంటనే పనిలో పడిపోతే ఆ వ్యాయామం తాలూకు అలసట రోజంతా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వేగంగా పరుగెత్తటం, వెయిట్ ట్రైనింగ్ లు చేశాక శరీరం అలసి పోతుంది. ఎంత ఎ.సి గుదుల్లో వ్యాయామం చేసినా శరీరం ,కండరాలు నీటిని కోల్పొతాయి.వర్కవుట్స్ వేడేక్కిన శరీరాన్ని కొద్దిగా నీళ్ళు తాగుతూ విశ్రాంతి తీసుకోంటూ చల్లబడాలి.వర్కవుట్స్ ముగించే సమయంలో రిలాక్సింగ్ కోసం వ్యాయామాలు చేస్తూ ఆపేయాలి. అంటే స్పీడ్ గా పరిగెత్తుతూ ఆ పైన రెండు నిమిషాలు నెమ్మదిగా జాగింగ్ చేస్తూ నిదానంగా నడుస్తూ ముగించాలి. పోస్ట్ వర్కవుట్స్ అన్న మాట. ఒక్క వ్యాయామం తర్వాత విశ్రాంతిగా ఇంకోటి చేస్తూ ముగించాలన్న మాట.