సలాడ్స్ లోవాడే లెట్యూస్ శాస్త్రీయ నామం లాక్టుకా సెటైవా. కొవ్వు కేలరీలు లేకుండా అచ్చంగా పోషకవిలువలతో నిండివున్న లెట్యూస్ ని తాజాగా పచ్చిగా తినవచ్చు. విత్తనాలు నాటిన నెలరోజుల్లో ఈ ఆకులను  తెంపి వాడుకోవచ్చు. ఆకుపచ్చ,ముదురు,ఎరుపు ,ఆకుపచ్చ ఎరుపు విశ్రమంగా ఉండే రంగాల్లో ఉండే లెట్యూస్ ఆకుల్లో ఎ,సి,కె,బి,బి12 విటమిన్లు ,ఐరన్ ,పోటాషియం, మాంగనీస్ వంటి ఖనిజ లవణాలు యాంటీ ఆక్సీ డెంట్లు మాంసకృత్తులు,పీచు ఉంటాయి. కొలెస్ట్రాల్ ,మధుమేహం,కీళ్ళ నొప్పులను తగ్గించి ,ఒత్తిడిని అదుపు చేస్తుంది. లెట్యూస్ ఆకులకు రెగ్యులర్ గా సలాడ్ తో తీసుకొంటే ఆరోగ్యకరమైన చర్మం నిగారింపుకు సహకరిస్తుంది.

Leave a comment