పేద విద్యార్థులకు ఆటస్ధలాలు  

‘యాంట్ హిల్ క్రియేషన్స్ పేరుతో పిల్లల క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తోంది లఖ్ నవూ కు చెందిన పూజా రాయ్ . అలాగే ప్లే ఇన్ ఎ బాక్స్  పేరుతో వెయ్యి రూపాయిలు ఖరీదు చేసే రకరకాల బొమ్మలు సహా ఆరు రకాల ఆటలు ఉండే పెట్టెను ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు ఉచితంగా అందిస్తోంది పూజా . తెలంగాణ ,ఆంధ్ర ,కర్ణాటక,ఒడిశా,మహారాష్ట్ర ,తమిళనాడు తదితర 17 రాష్ట్రాలు క్రీడా మైదానాలు సాధించారు . ఐ ఐ టీ ఖరగ్ పూర్ లో చదువుకొన్న పూజా ప్రభుత్వ పాఠశాలల్లో  పిల్లలు ఆడు కొనేందుకు అవసరమైన సదుపాయాలను మెరుగు పరిచే పని చేసేది చదువు అయ్యాక ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ నెలకు లక్షా పాతిక వేలు సంపాదించే పూజా ఆ జాబ్ వదులుకొని నిరుపేద విద్యార్థుల కోసం పనిచేస్తోంది.