మొక్కలు నాటేద్దాం

కావేరి నది పరిరక్షణ కోసం మొక్కలు నాటుదాం. ఆసక్తి ఉన్నా వాళ్ళు విరాళాలు ఇవ్వండి. అందరం కలిస్తే లక్ష మొక్కలు నాటగలం 42 రూపాయల విరాళంతో ఒక మొక్క నాటవచ్చు అంటు సోషల్ మీడియా వేదికగా పిలుపు ఇచ్చింది సమంత చక్కని సినిమాల్లో నటించటం మాత్రమే కాదు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ సేవకు సిద్ధం అవుతోంది సమంత. కావేరి పరిరక్షణ కోసం సద్గురు జగ్గీ వాసు దేవ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంబించారు ఈ పనికి సమంత మద్దతు ప్రకటించింది. ఇప్పటికే ప్రత్యూష ఫౌండేషన్ పేరిట సేవలు అందిస్తోంది సమంత. చక్కగా మొక్కలు నాటేందుకు నడుం బిగిచింది.