ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టి పేట సమీపంలో మనకు ఈ గుట్ట కనిపిస్తుంది.అటవీ ప్రాంతమంతా దట్టమైన చెట్లతో పచ్చగా కళ కళ ళాడుతూ ఉంటుంది.

పూరాణ గాథల ప్రకారం కుంతీదేవి కుమారుని కోసం శివుని ధ్యానం చేస్తూ వుంటే శివుడు ఆమెని పరీక్షించాలని మట్టి కుండను తయారు చేసి కప్పలు, చేపలు తిరగని నది నుండి నీరు తెచ్చి తనకు నైవేద్యం పెట్టమని శాసించాడు.కుంతీదేవి కుండను తయారు చేసింది కానీ నీటి కోసం ఎదురుచూస్తూ ఉన్నపుడు శివుడు భక్తికి మెచ్చి ఒక గుట్టపై నుండి చల్లని నీళ్ళు ప్రవహింప చేశాడు.కుంతీదేవికి 5గురు కుమారులను ప్రసాదించాడు వారే పంచ పాండవులు.పెద్దయ్య,చిన్నయ్య అంటే ధర్మరాజు, భీముడు అంటారు.
ఈ గుట్ట వెయ్యి అడుగుల ఎత్తులో ఉంటుంది.భీముడు ఈ ప్రాంతంలోనే హిడింబిని వివాహమడాడు.ఇక్కడ గట్టిగా చప్పట్లు కొడితే గుట్ట పై నుంచి నీళ్ళు  ప్రవహిస్తాయి.

నిత్య ప్రసాదం:కొబ్బరి,పండ్లు

             -తోలేటి వెంకట శిరీష

Leave a comment