డిజైనర్ జోయీ బ్రాడ్లీ కేవలం కాయితాలతో అందమైన  రోజా పువ్వుల గౌను కుట్టేశాడు .ఆ గౌను కుట్టేందుకు 4౦౦ పైన గులాబీలు ఉపయోగించాడు .పేపర్ ను కావలసినట్లు కత్తిరించుకొని ఆ తరువాత ముక్కలతో అందమైన గులాబీలు తయారు చేసుకొని, గ్లూ అంటిస్తూ ఈ గులాబీలు ఒక ఆర్డర్ లో అంటించుకొంటూ వస్తే అందమైన గులాబీ పూల గౌను తయారైంది . జోయీ కి ఈ డ్రస్ చేసేందుకు వారం రోజుల సమయం పట్టింది .ఇద్దరు సహాయకులతో కలసి కేవలం కాగితాలతో ఈ అద్భుతమైన గౌనూ తయారు చేశారు . జోయీ బ్రాడ్లీ సరికొత్త ప్రయోగం అందరికి  నచ్చేసింది .లండన్ లో  జోయీ పేరుమోసిన డిజైనర్ .

Leave a comment