పాపాయికి అన్నం ,పప్పు

పిల్లలకు ఇచ్చే ఘనాహారం ఇవ్వాళ జీడిపప్పులు, బాధం పప్పులతో ఎంతో సత్తువ నిచ్చే ఆహారంగా తయారు చేసి ఇస్తున్నామంటున్నారు మోడ్రన్ తల్లులు. కానీ న్యూట్రిషనిస్ట్ లు మెత్తగా చేసిన అన్నం, పప్పు చారు, నెయ్యి వేసి పెట్టమంటున్నారు. బియ్యం, కందిపప్పు ,పెసరపప్పు బాధం,జీడి, పిస్తా కూడా కలిపి రవ్వలా చేసి ఉంచుకొని దాన్ని నీళ్ళతో వండి ,చారు, నెయ్యి వేసి పెట్టమంటున్నారు .మిక్సీలో వేస్తే టేస్ట్ మారి పోతుంది, మెత్తని పండ్లు చేతిలో నలిపిపెట్టవచ్చు. ఆకు కూరలు ,పప్పు తో వండి వారానికి రెండు మూడు సార్లు పెట్టవచ్చు. క్యారెట్ ,బీట్ రూట్ ఉడికించి సూప్ లాగా ఇవ్వచ్చు. చికెన్ ,చేప మెత్తగా నలిపి ఇవ్వచ్చు. ఉడికించిన గుడ్డులో పచ్చ పొన అన్నంతో కలిపి పెట్టవచ్చు. అయితే పంచదార ,తేనే వంటి తీపి పదార్ధాలు అలవాటు చేయవద్దని అంటున్నారు డాక్టర్లు. సంవత్సరం వచ్చే వరకు ఈ ఆహారం అలవాటు చేస్తూ తల్లిపాటు సరిగా ఇవ్వాలని చెపుతున్నారు.