మనుషులు,మనుషులుగా జీవిచటం చాలా పెద్ద కష్టం అంటాడు గాలిబ్. మనిషి లక్షణాలంటే ఇతరులకు కష్టం పెట్టకుండా,దయతో ప్రేమతో ఉండటం అయితే అలాటి వాళ్ళ కోవ లోకి వస్తాడు ముంబయ్ కి చెందిన అశ్వని షెనాయ్ అంకుష్ నిలేష్ షా భార్యాభర్తలు. వాళ్ళ ఇంట్లో వంట పని చేస్తుంది బావన బెన్ పటేల్. ఆమె భర్తకు పక్షవాతం వచ్చింది. అతని వైద్యం కోసం డబ్బు ఉచితంగా ఇస్తామంటే అభిమానం తో వద్దంది బావన . ఆమెకు వంట పని ఒక్కటే వచ్చు. ఆమెకు సాయం చేసేందుకు ఈ దంపతులు ముంబాయిలోని కాండివాలి స్టేషన్ దగ్గరలో ఉదయపు ఉపాహారశాల ఏర్పాటు చేశారు. ఇందులో ఉదయం ఐదు నుంచి తొమ్మిది వరకు వేడి వేడి ఉపాహారాలు అమ్మి,ఆ తరువాత వాళ్ళ ఆఫీస్ లకు వెళ్ళిపోతారు. పని మనిషి కోసం ఈ స్టాల్ ఓపెన్ చేసిన ఈ దంపతులకు సోషల్ మీడియాలో వేలకొద్దీ  అభిమానులై పోయారు.

Leave a comment