వేసవి వస్తే ఎండలే. కాసేపు కరెంటు పోయినా భరించ లేనంత ఉక్క. ఎప్పుడూ ఎ.సి లో కూర్చుంటే నాలుగ్గోడలు బోర్ కొట్టేస్తాయి. అయితే ఎ.సి లేకుండా ఇల్లంతా చల్లదనంతో నింపాలంటే మొక్కలు పెంపకం మంచి ఆలోచన. అలాగే చిన్ని చిన్ని నియమాలు పాటిస్తే ఇటు చల్లదనం, కరెంటు కర్చు తగ్గించుకో వచ్చు. కిటికీ తీసి వుంటే గది వాతావరనం చల్ల బడుతుంది. ఇంటికి డ్రెస్ వెంటిలేషన్ చాలా ముఖ్యం. ఉదయం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు, సాయంత్రం ఏడు గంటల నుంచి పది గంటల వరకు కిటికీలు తెరిచి ఉంచితే గది చల్లబడుతుంది. గదిలో లైట్లు ముఖ్యంగా ఇన్కాండిసెంట్ బుల్బులు వేసి ఉంచితే అపరిమితమైన వేడి విడుదల అవుతుంది. వాటి స్థానంలో లెడ్ లేదా ఫ్లోరోసెంట్ బల్పులు వాడటం మంచిది. గదిలో మొక్కలు ఒక పద్దతి ప్రకారం పెంచాలి. ఇల్లంతా పచ్చదనం తో నిండి ఎయిర్ కండీషన్ లా తయారవుతుంది. ఇంట్లో షేడి మొక్కల్ని పెంచి వాటిని తూర్పు, పశ్చిమ దిశల్లో పెడితే సూర్యకిరణాల తాకిడి నుంచి తప్పించుకోవచ్చు. కిటికీల్లో పచ్చని మొక్కలు పెట్టాలి. అప్పుడు గది వాతావరణం తేమగా, చల్లగా వుంటుంది.

Leave a comment