భారతదేశంలో వివాహం పట్ల విముఖత ప్రదర్శించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతుంది అంటున్నాయి అధ్యయనాలు . గడిచిన ఒకటి రెండు దశాబ్దాలలో ఒంటరిగా జీవించే వారి సంఖ్య 40 శాతం పెరిగింది అంటున్నారు . ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలైన ఐరోపా అమెరికాలో ఒంటరిగా జీవించేందుకు ఇష్టపడే జనాభా అధికం . ఒక పదేళ్ళ క్రితం సమాచారం ప్రకారం ఒంటరి కుటుంబాల శాతం ఆ దేశాల్లో 30 నుంచి 35పై చిలుకు చేరింది . చైనా,జపాన్ వంటి దేశాలు మధ్యస్తంగా ఉండగా భారతదేశం అమెరికా దేశాలలో సమానంగా ఉంది. వివాహం అనగానే పలురకాల ఆంక్షలు ,పెద్దల పాత్ర వారుపెట్టే నియమ నిబంధనలు హాయిగా తమంతట తాము తమ భాగస్వామిని ఎంపిక చేసుకోలేని సంకెళ్ళు ఇవన్నీ అడ్డంకులుగా చెపుతున్నారు భారతదేశంలో యువత.

Leave a comment