రోజూ తలకు నూనె రాయటం మంచిదేనా అంటే కాదనే అంటారు . ఆయుర్వేదం వైద్యం ప్రకారం మటుకు నూనె రాయటం అన్నాది దైనందిన పనుల్లో భాగం . కానీ నవీన వైద్య విధానంలో ప్రతి రోజు జుట్టుకు నూనె పెడితే హాని జరగదు కానీ మాడు పై రంద్రాలు మూసుకుపోతాయి . తలస్నానం చేసే ముందర నూనె పెట్టుకోవటం మంచి చికిత్స . నూనె రాసి తేలిగ్గా కుదుళ్ళు నుంచి మసాజ్ చేస్తేనే రక్తసరఫరా మెరుగవుతుంది . జుట్టుకు పోషకాలు అందుతాయి . ఆయిల్ మసాజ్ మాడును ఆరోగ్యంగా ఉంచుతుంది . ప్రతి రోజు నూనె పెట్టుకోవలసిన అవసరం లేదు వారంలో రెండు మూడుసార్ల తో సరిపోతుంది . జుట్టును గట్టిగ రుద్ద కూడదు . వేళ్ళకొనలతో మృదువుగా గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేసుకోవాలి .

Leave a comment