నూనె మసాజ్ మంచిదే

శిరోజాలు ఏపుగా ఒత్తుగా పెరగడం కోసం ఏనాటి నుంచో తలకు నూనె పెట్టుకోవడం అలవాటుగా వస్తుంది. ఆయిలింగ్ వల్ల శిరోజాలకు ఎలాంటి హనీ ఉండదు.షాంపూ చేసుకునే ముందర జుట్టు కుదుళ్ళకు నూనె పెట్టుకుని మసాజ్ చేస్తే పోషకాలు లభించి జుట్టు బావుంటుంది.ఈ ఆయిల్ మసాజ్ చేస్తే పోషకాలు లభించి జుట్టు బావుంటుంది.ఈ ఆయిల్ మసాజ్ తో రక్త సరఫరా మెరుగై శిరోజాలు టెక్చర్ మృదువుగా మారుతుంది.మాడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నూనె రాసిన గుంటలో షాంపూ చేయవచ్చు. కానీ ఆరోగ్యవంతమైన జుట్టు పెరుగుదల శారీరక మానసిక అంతర్గత ఆరోగ్యం పై ఆదారపడి ఉంటుంది.