వేగవంతమైన జీవన శైలితో ,కంప్యూటర్ కంటే వేగంగా పని చేయవలసి వస్తూ మెదడు చాలా అలసిపోతుంది. ఒత్తిడికి గురవుతుంది. అప్పుడు ఒత్తిడిని తగ్గించి మెదడును చురుకుగా ఉంచేందుకు కొన్ని పదార్థాలు తినమంటున్నారు ఆహారనిపుణులు. అశ్వగంధ పొడిని గొరువెచ్చని పాలలో కలిపి పడుకోనే ముందర తాగితే హాయిగా నిద్రపట్టీ ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ హార్మోన్ శాతం తగ్గిపోతుంది. అలాగే నాడీ కణాల పని తీరు పెంచేందుకు మెదడు చురుకు దనం కోసం వాల్ నట్స్ని మించినవి లేవు. రోజు వాల్ నట్స్ తీసుకోవాలి. పసుపులో ఆనందం కలిగించే కోపమైన్ నెలటోనిన్ హార్మోన్ల స్రావాన్ని పెంచే కురుకుమిన్ ఉంది. దీన్ని పాలలో వేసుకోని రాత్రి పడుకోనే ముందర తాగితే మంచిదే.

Leave a comment