నేనెప్పుడూ మంచి పేరు కోసమే పని చేశాను . ఒక సినిమా చేయాలా వద్దా అన్న విషయంలో నేనెప్పుడూ డబ్బు వైపు చూడలేదు . ఆ సినిమా వల్ల నాకు ఎంతో పేరు వస్తుందీ అన్న విషయం మాత్రం ఆలోచించుకొని కష్టపడుతూ వచ్చాను . అలాగే పేరు వచ్చింది . డబ్బు కూడా వచ్చేసింది అంటోంది సమంత . నాకేరీర్ లో పదేళ్ళు గడిచాయి . కాలం గడిచేసేది కొత్త హీరోయిన్లు వచ్చారు . కొందర్ని బాగా నటించారనీ కొందర్ని అందంగా ఉన్నారనీ ప్రేక్షకులు గుర్తు పెట్టుకొంటారు కానీ నా విషయంలో నన్ను నా నటనకు గాను నన్ను గుర్తుపెట్టుకోవాలనీ వీలైనంత కాలం నాపేరు నిలిచిపోవాలని కోరుకొంటాను ప్రతి సినిమా ను నా మొదటి సినిమానే అనుకోని ఎంతో శ్రద్దగా ఉంటాను అలాగే మంచి కధలు ,మంచి సినిమాలు నాకోసం వస్తున్నాయి . నా ఆశ నెరవేరుతోంది అంటోంది సమంత .

Leave a comment