నేనెన్నటికీ మారను

నేను ధరించే దుస్తులు పాటించే పద్దతుల వరకు సంస్కృతి సంప్రదాయాల కే విలువ ఇస్తాను అంటోంది అనుపమా పరమేశ్వరన్ . నేను ఈ తరం అమ్మాయిని వృత్తిరీత్యా  ఎంతో మందిని కలుస్తూ ఉంటాను . స్టూడియో లో ఎంతో మందిని కలసి పనిచేయి వలసి వస్తుంది . పాత్రలను బట్టి రూపం మారుతుంది కానీ వ్యక్తిగత శైలి ఎన్నడూ మార్చుకోలేదు . నేను సినిమాల్లోకి రాకముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటాను . ఇంట్లో మా పెద్దవాళ్ళు చెప్పే మాటలు ,వాళ్ళు పాటించే పద్ధతులు ,నమ్మకాలూ ఒక క్రమశిక్షణ పూరితమైన జీవితానికి దోహదం చేస్తాయి . నేను వాటినన్నింటినీ విశ్వసిస్తాను . ఆచరిస్తాను సాంప్రదాయ బద్దమైన జీవితం నాకెంతో కంఫర్ట్ గా ఉంటుంది అంటుంది అనుపమా పరమేశ్వరన్ .